నవంబరు 14, బాలల దినోత్సవం. ఈ సందర్భంగా వారి కోసం ఈ చిన్ని సంగతులు.. ఈ లోకం చిన్నారులదే. వారే భావి భారత నిర్మాతలు. ఆనందంగా ఆడుతూపాడుతూ పెరిగే చిన్నారులే రేపటి భాగ్య విధాతలవుతారు. చిట్టిపొట్టి చిన్నారులకు నిండారా బాలల దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతూ..
‘భారతదేశము నా మాతృభూమి.
భారతీయులందరూ నా సహోదరీ సహో దరులు.
నేను నా దేశమును ప్రేమించుచున్నాను.
సుసంపన్నమైన, బహువిధమైన నా దేశ వారసత్వ సంపద నాకు గర్వకారణము.
నా తల్లిదండ్రులను, ఉపాధ్యాయులను, పెద్దలందరినీ గౌరవింతును.
ప్రతివారితోనూ మర్యాదగా నడుచు కుందును.
ఈ వాక్యాలు చిన్నప్పటి జ్ఞాపకాలను తట్టి లేపాయా? బడిలో చదువులమ్మ ఒడిలో వల్లె వేసిన ‘ప్రతిజ్ఞ’ గుర్తొచ్చిందా? అప్పుడు కాస్త అర్థమయ్యీ అర్థం కాకపోయినా వాటి వెనుక ఉన్న స్ఫూర్తి ఇప్పటికీ వెంటాడుతోంది కదూ!. చిన్ననాటే మన మనసులపై అంతటి మహత్తర ముద్ర వేసిన ఈ ప్రతిజ్ఞ 1962లో పురుడు పోసుకుంది.
పాఠశాలల్లో ఏ విద్యార్థి నోట విన్నా, ఒకటో తరగతి నుంచి పదో తరగతి వరకు ఏ పుస్తకం తొలి పుటల్లోనైనా కనిపించే ఈ ‘భారత జాతీయ ప్రతిజ్ఞ’ రూపకర్త ఎవరో తెలుసా? పైడిమర్రి వెంకట సుబ్బారావు. దేశానికి జాతీయ పతాకాన్ని అందించినట్టే, జాతీయ పతాకాన్ని అందించిన ఘనత తెలుగువారిదే. ప్రతి భారతీయుడి బాధ్యతను బాల్యంలోనే గుర్తు చేసేలా సాగిన ఈ రచన జాతీయ గీతం, జాతీయ గేయం తరువాత స్థానం సంపాదించుకుని తెలుగు ‘వాడి’కి ప్రతీకగా నిలిచింది.
Review పిల్లల్లారా.. వెన్నెల్లారా.