స్వర్గంలో సంచరిస్తున్న బ్రహ్మదేవుడికి ఒక సందేహం కలిగింది. లోకాలను అన్నింటినీ సృష్టించిన తనను భూలోక వాసులు గుర్తుపెట్టుకున్నారా? లేదా? అనే విషయం తెలుసుకోవాలన్న కుతూహలం కలిగింది. అనుకున్నదే తడవుగా భూలోకానికి వెళ్లాలని అనుకున్నాడు.
ప్రయాణికుడిలా మారిపోయి ఒక శిల్పి ఇంటికి చేరుకున్నాడు. అక్కడ ఎన్నో అందమైన విగ్రహాలు ఉండటం చూసి ముచ్చటగా అనిపించింది బ్రహ్మకు. ఒక విగ్రహాన్ని చూపిస్తూ దీని ఖరీదు ఎంత? అని శిల్పిని అడిగాడు బ్రహ్మ. దానికి శిల్పి అది అంత ప్రముఖమైన విగ్రహం కాదని, దాని ధర తక్కువగానే ఉంటుందని బదులిచ్చాడు. అతని జవాబుకు బ్రహ్మ సంతోషించాడు.
తరువాత ఒక స్త్రీ విగ్రహాన్ని చూపిస్తూ దీని ధర ఎంతో చెప్పగలవా? అని శిల్పిని ప్రశ్నించాడు ప్రయాణికుడి రూపంలో ఉన్న బ్రహ్మ.
దానికి శిల్పి ఆ విగ్రహం కొంచెం కష్టపడి చేశానని, అందుకు తగినట్టే దానికి కొంత డిమాండ్ ఉందని, కాబట్టి అది కాస్త ఎక్కువ ధర పలుకుతుందని సమాధానం ఇచ్చాడు.
కొద్దిసేపు విగ్రహాలన్నింటినీ పరిశీలించిన బ్రహ్మకు ఒక మూలలో తన విగ్రహం తారసపడింది. బ్రహ్మ తన విగ్రహం ఎక్కువ ధర పలుకుతుందని భావించి సంతోషంగా మరి ఈ విగ్రహం ధర ఎంతని తన విగ్రహాన్ని చూపిస్తూ శిల్పిని అడిగాడు.
‘మీరు మొదట అడిగిన ఆ రెండు విగ్రహాలను తీసుకుంటే ఈ బ్రహ్మ విగ్రహాన్ని ఉచితంగా ఇస్తాను’ అన్నాడు శిల్పి.
ప్రయాణికుడి రూపంలో ఉన్న బ్రహ్మ శిల్పి మాటలకు నోరెళ్లబెట్టాడు.
నీతి:మన గురించి మనం అతిగా ఊహించుకోవడం కానీ, మనపై మనకు అతి విశ్వాసం కానీ ఉండటం తగదు. ముఖ్యంగా మన గురించి ఇతరుల అభిప్రాయం ఏమిటో తెలుసుకునే ప్రయత్నం అసలు చేయకూడదు. మనం సవ్యంగా పనిచేస్తే అదే అందరి దృష్టిలో
Review బ్రహ్మ శిల్పి.