సామెత కద

కొండను తవ్వి ఎలుకను పట్టినట్లు..
ఏదైనా ఒక పని చేయడానికి కొందరు చాలా హడావుడి చేస్తారు. ఏదో జరిగిపోతుందని, జరగబోతుందనే భావన కలిగిస్తారు. తీరా చివరికి వచ్చే సరికి ఏం తేల్చలేక తుస్‍మనిపిస్తారు. ఇటువంటి సందర్భాలలోనే ఎక్కువగా ఈ సామెతను వినియోగిస్తుంటారు. ప్రస్తుత రాజకీయాల్లో ఈ సామెత ఎక్కువగా ఉపయోగపడుతుందని చెప్పవచ్చు. అవి చేస్తాం, ఇవి చేస్తాం అని నాయకులు ప్రకటించడం, చివరకు ఏం చేయలేక చేతులెత్తేయడం వంటి సందర్భాలకు ఇది అతుకుతుంది. అలాగే సంచలనం సృష్టించిన నేర సంఘటనల విషయంలో పోలీసులు కేసులను ఛేదిస్తామంటూ ప్రకటిస్తారు. దర్యాప్తు చాలా వేగంగా జరుగుతోందని, నేరగాళ్లను పట్టుకుని తీరతామని అంటారు. చివరికి వచ్చే సరికి తగిన ఆధారాలు లేనందున కేసును మూసివేస్తున్నట్టు ప్రకటిస్తారు. ఇటువంటప్పుడే ‘కొండను తవ్వి ఎలుకను పట్టారు’ అని వ్యంగ్యంగా వ్యాఖ్యానిస్తుంటారు. బృహత్తర కార్యక్రమం ఏదైనా చేపట్టినప్పుడు తగిన ఫలితాలు సాధించకపోతే ఈ సామెతను అన్వయిస్తుంటారు. చాలా పెద్ద ప్రయత్నాలు చేసి చివరకు అనుకున్న ఫలితం సాధించలేనప్పుడు ఈ సామెత అతికినట్టు సరిపోలుతుంది.

అంగట్లో అన్ని ఉన్నాయి కానీ అల్లుని నోట్లో శని

కొందరికి ఉండటానికి అన్నీ ఉంటాయి. కానీ, వాటిని అనుభవించడానికి వచ్చే సరికి ఎందుకనో అవి దక్కకుండా పోతాయి. అటువంటి సందర్భాలలోనే ఈ సామెతను ఉపయోగిస్తుంటారు. పల్లెల్లో ఈ సామెతను తరచూ వాడుతుంటారు. ఇదెక్కువ ప్రాచుర్యంలో ఉన్న సామెత. ఒక్కోసారి మనం ఏదైనా పని చేయాలని సంకల్పించినప్పుడు అన్నీ అనుకూలంగానే ఉన్నట్టు ఉంటాయి. అన్నీ కుదిరినట్టే అనిపిస్తుంది. కానీ, ఆ పని చేయతలపెట్టే సరికి ఎంతకూ ముందుకు కదలదు. ఇటువంటి సందర్భాలలో పని చేసే వాడి అదృష్టం బాగా లేదనే అర్థంలో ఈ సామెతను ప్రయోగిస్తారు. అలాగే, రైతులు వ్యవసాయం చేయడానికి సిద్ధమవుతారు. నాట్లుపోస్తారు. వర్షాలు పడవు. నిజానికి ఆ సమయంలో వర్షం పడితే నాట్లు ప్రాణం పోసుకుంటాయి. పంట బాగా వస్తుంది. అయితే, సమయానికి వర్షాలు లేకపోవడంతో ఏం చేయలేని పరిస్థితి. పంట సాగుకు మిగతా పరిస్థితులు బాగా ఉన్నా.. దాన్ని సాగు చేస్తున్న రైతుకు అదృష్టం లేదనే కోణంలోనూ దీన్ని ప్రయోగిస్తారు.

Review సామెత కద.

Your email address will not be published. Required fields are marked *

Related posts

Top