
SAT లేదా ACT కు ఏ విధంగా సిద్ధం కావాలి? స్కూల్ విద్యార్థులకు ఎదురయ్యే పెద్ద ప్రశ్న ఇది. తమ తమ కాలేజీల్లో చేరే క్రమంలో విద్యార్థులను వారు సాధించిన మార్కులను సబ్మిట్ చేయవలసిందిగా కాలేజీలు విజ్ఞప్తి చేస్తుంటాయి. హైస్కూలు విద్యను అభ్యసిస్తున్నప్పుడే SAT లేదా ACT ల గురించి ఒక అవగాహన, ఆలోచన కలిగి ఉండటం మీరు రాబోయే రోజుల్లో వేయబోయే ముఖ్యమైన అడుగులకు నాంది.
విద్యార్థుల కోసం ఒక సమగ్రమైన ప్రణాళిక:
1.ప్లానింగ్: SAT లేదా ACTకు సిద్ధం కావాలనే ఆలోచన ఉన్న విద్యార్థులు పాఠశాల స్థాయినుంచే ప్రిపరేషన్ మొదలుపెట్టాలి. ఇలా ప్రిపరేషన్‌ను ముందుగా మొదలు పెట్టటం వల్ల విద్యార్ధికి పరీక్షాంశాలపై సమగ్ర అవగాహన పొందగలిగే అవకాశ ముంటుంది. SAT లేదా ACTలో ఏది ఎంచుకోవాలి? లేదా రెండింటినీ ఎంచుకోగలమా అన్న అంశాన్ని ముందుగా తేల్చుకుంటే విద్యార్ధులకు తాము ఏది ఎన్నుకోవాలన్న అంశంపై స్పష్టత ఉంటుంది.
2. ప్రిపరేషన్: ప్లాన్‌లో ఇది చాలా ముఖ్యమైన భాగం. పుస్తకాల ద్వారా, ఆన్లైన్ కోర్సుల ద్వారా, క్లాస్రూమ్ బేస్డ్ సెషన్స్ ద్వారా, ప్రైపేటు ట్యూషన్ల ద్వారా… ఇలా అనేకరకాల వనరులున్నాయి.
ప్రతిదానికీ దానికి సంబంధించిన పద్ధతి, ఆచరణ ఉంటుంది విధానాలు ఉంటాయి. విద్యార్థుల అవగాహన స్థాయిని బట్టి, సామర్థ్యం మేరకు ఎవరికి తగిన పద్ధతిని వారు ఎంచు కోవలసి ఉంటుంది. ఏ మార్గాన్ని ఎంచు కున్నప్ప టికీ టెస్టుల్లో ఎవరెవరు ఎంత మంచి మార్కులను స్కోర్ చేస్తున్నారు, అందుకోసం వారు ఎంత బాగా ప్రాక్టీస్ చేస్తున్నారనేదాన్ని బట్టి వారి ప్రిపరేషన్ ఆధారపడి ఉంటుంది. నియమిత సమయం పెట్టుకుని పూర్తిస్థాయి టెస్ట్‌ను అనేక విధాలుగా ప్రిపేర్ అయి అనేకపర్యాయాలు రాసి బాగా ప్రాక్టీస్ చేయడం ద్వారా విద్యార్థులు బెంచ్ మార్క్ స్కోర్‌ను దాటి వాస్తవిక స్కోరును చేరుకోగలుగుతారు.
3. సైకాలజీ: అన్నింటినీ సానుకూలంగా చూడగల మనస్తత్వం, సవాళ్లను తీసుకొని, వాటిని అధిగమించగల ధోరణి, లక్ష్యంపైనే ద•ష్టి పెట్టి, దాన్ని ఎలాగైనా సాధించాలన్న తపనలే మనలోని బలహీనతలను పక్కకు నెట్టి, ఆత్మవిశ్వాసాన్ని పెంచుతాయి. మానసికంగా బలాన్నిస్తాయి. ప్రాక్టీస్, యాటిట్యూడ్లు ఎప్ప్పుడైతే కలిసి పని చేస్తాయో, •స్ట్లో మంచి మార్కులు సాధించ గలమో, అప్పుడే చివరి పరీక్షలను చక్కగా సమర్థ వంతంగా రాయగలరు.
స్కోర్‌ను మెరుగు పరచుకోవడం
SAT లేదా ACT లలో మనకు కనిపించే ఒక మెరుగైన అంశమేమిటంటే,వాటిని ఎన్నిసార్లైనా రాయవచ్చు. చాలామంది విద్యార్థులు అదేపనిగా అటెంప్ట్ చేయడం వల్ల మంచి స్కోర్‌ను స్యాధించ గలుగుతున్నారు. కాలేజీల తీరుతెన్నులు కూడా మంచి స్కోర్ అందుకునేందుకు తగ్గట్టుగా వాటి పనితీరును మార్చుకోగలుగుతున్నాయి.
మనం వేసుకున్న ప్రణాళికను సరిగ్గా అమలు చేయగలగడం కూడా SAT / ACTను సులువుగా హ్యాండిల్ చేయగల మంచి అంశం.
దీప్తి మోడి ఐ లెర్న్ అకాడెమీ
ఐ లెర్న్ అకాడెమీ సమ్మర్/ ఫాల్/ స్ప్రింగ్ సీజన్లలో ఇన్స్ట్రక్టర్ లెడ్ క్లాస్రూమ్ బేస్డ్ SAT / ACT ప్రిపరేషన్ కోర్సులను ఆఫర్ చేస్తోంది. బ్యాచ్‌లు సైజ్ పరిమితంగానే ఉంటుంది కాబట్టి వ్యక్తిగత శ్రద్ధతో ట్రెయినింగ్ ఇవ్వడం సాధ్యపడుతుంది.
-దీప్తి మోడి
email: diptimodi@ilearn-academy
678-462-6817
Review SAT/ACT ఏవిధంగా సన్నద్ధం కావాలి.