
మహిళల ఆరోగ్యానికి పూర్తి భద్రత, భరోసానిస్తోంది.. నార్త్ అట్లాంటా ఉమెన్స్ కేర్. కుటుంబ బాధ్యతల రీత్యా, ఇతరత్రా కారణాల రీత్యా మహిళలు తమ ఆరోగ్యానికి సంబంధించి జాగ్రత్తలు తీసుకునేది తక్కువే. తమ ఆరోగ్యానికి సంబంధించి సమస్యలు తలెత్తినప్పుడు సరైన వైద్యులను ఎవరిని సంప్రదించాలనే విషయంలోనూ గందరగోళానికి గురవుతుంటారు. అటువంటి సందర్భంలో సరైన సమాధానం.. ‘నార్త్ అట్లాంటా ఉమెన్స్ కేర్’. వైద్యపరంగానే కాక పేషంట్ల పట్ల ప్రేమ, ఆప్యాయతలను కనబరుస్తూ, వారిని స్నేహితుల్లా ట్రీట్ చేస్తూ చక్కని సలహా సూచనలు ఇచ్చే హాస్పిటల్ నార్త్ అట్లాంటా ఉమెన్స్ కేర్. అబ్స్టెస్ట్రిక్స్ అండ్ గైనకాలజీ (ఓబీ/జీవైఎన్)కి సంబంధించి పూర్తి గైడెన్స్ అందిస్తుంది. నార్త్ అట్లాంటా ఉమెన్స్ కేర్లోని అబ్స్టెస్ట్రిక్స్ అండ్ గైనకాలజీ విభాగం. జాన్స్ క్రీక్ మరియు ఆల్ఫరెట్టా ప్రాంతాలలో గల ఈ ఉమెన్స్ కేర్ విభాగాలు మహిళల ఆరోగ్య సమస్యలకు చక్కని చిరునామాగా నిలుస్తున్నాయి.
ప్రత్యేకతలు
అపారమైన అనుభవం కలిగిన మహిళా వైద్య బృందం..
వైద్య సేవలపై అంకితభావం కలిగిన మహిళా వైద్యులు, సహచర సిబ్బంది..
ఇక్కడ పొందిన సేవలపై సంతృప్తి వ్యక్తం చేస్తున్న వేలాది మంది పేషంట్లు..
మహిళలు తమ ఆరోగ్య సమస్యలకు సంబంధించి అబ్స్టెస్ట్రిక్స్ లేదా గైనకాలజిస్టులను ఎంచుకునేందుకు చాలామంది వైద్యులు, ఆస్పత్రులు అందుబాటులో ఉన్నాయి. అయితే, ఓబీ/జీవైఎన్ విభాగాలకు సంబంధించిన ఆరోగ్య సమస్యలకు నార్త్ అట్లాంటా ఉమెన్స్ కేర్ కచ్చి తంగా అత్యుత్తమ ఎంపిక అవుతుంది. జార్జియాలో గల ఈ హాస్పిటల్లో వివిధ విభాగాల్లో వేల మంది పేషంట్లు చికిత్స పొందారు. చికిత్స కోసం, వైద్య సలహాలు, సంప్రదింపుల కోసం ఇక్కడకు వచ్చి తమ సమస్యలకు మంచి పరిష్కారం పొందిన ఎందరో పేషంట్లు మానసిక సంతృప్తి, సంతోషాలతో తిరిగి వెళ్తున్నారు. ఇక్కడి వైద్యులు, ఇక్కడ అందుతున్న వైద్యం, చికిత్సలపై వారి స్పందనే ఇందుకు నిదర్శనం.
ఏయే సేవలు లభిస్తాయి?
స్త్రీలు ఎదుర్కొనే అన్ని రకాలైన ఆరోగ్య సమస్యలు, రోజువారీ జీవనంలో ఆరోగ్యంగా ఉండేందుకు అవసరమైన సాధారణ పరీక్షలు, కుటుంబ నియంత్రణ, సాంసారిక సమస్యలు, ఎస్టీడీ పరీక్షలు వంటివి ఇక్కడ నిర్వహిస్తారు. స్త్రీలు ఎదుర్కొనే అతి పెద్ద ఆరోగ్య సమస్య- గైనిక్ ప్రాబ్లమ్. దీనికి అత్యుత్తమ పరిష్కారం ఇక్కడ లభిస్తుంది. ఇక్కడి నిపుణులైన మహిళా వైద్యుల బృందం అత్యద్భుత గైనిక్ చికిత్సను అందిస్తోంది.
చికిత్సే కాదు.. ఆప్యాయతా అందిస్తారు
నార్త్ అట్లాంటా ఉమెన్స్ కేర్లో పేషంట్ – డాక్టర్ రిలేషన్ కేవలం వైద్యానికి సంబంధించి మాత్రమే ఉండదు. ఇక్కడి వైద్యులు.. పేషంట్లతో ఆత్మీయంగా మెలుగుతారు. అపారమైన అనుభవం, నైపుణ్యం గల వైద్యులు.. పేషంట్లతో ఆప్యాయంగా మాట్లాడతారు. అనుబంధాన్ని పెంచుకుంటారు. డాక్టర్ సుజాతా వివేక్, విట్నీ కుక్ వంటి అత్యుత్తమ వైద్యుల చికిత్సా విధానంపై ఎందరో రోగులు కృతజ్ఞత తెలిపే విధానం మాటలకు అందదు. ఇక్కడ పేషంట్లను ఆదరించే తీరుతోనే సగం ఆరోగ్యం స్వస్థత పడుతుందంటే అతిశయోక్తి కాదు. ఇంకో విషయం ఏమిటంటే.. ఇక్కడ పని చేసే సర్టిఫైడ్ గైనకాలజీ, అబ్సెస్ట్రిక్ ఫిజిషియన్లతో కూడిన బృందంలోని వారంతా మహిళలే. చికిత్స కోసం వచ్చే మహిళల ఆరోగ్య పరిరక్షణకు వీరు చూపే శ్రద్ధ.. పేషంట్ల మనసులో చెరగని ముద్ర వేస్తుంది. కేవలం ట్రీట్మెంట్ చేసి పని అయిపోనట్టు వీరెవరూ భావించరు. మహిళల జననావయవాలకు సంబం ధించిన సమస్యలపై, ఆరోగ్య పరిరక్షణకు తీసుకోవాల్సిన స్వయం సంరక్షణ పద్ధతులపై సమగ్రమైన అవగాహనను కల్పిస్తారు. రోగ నిర్ధారణ, చికిత్స పక్రియల్లో అనుక్షణం తోడుగా ఉంటారు.
ఇక్కడ ఆరోగ్య సంరక్షణ కోసం అన్ని సదుపాయాలు అందుబాటులో ఉన్నాయి. పేషంట్లు ఆస్పత్రికి వచ్చామనే భావన కాకుండా ఫ్రెండ్లీ విజిట్గా ఫీలయ్యే విధంగా ఇక్కడ ట్రీట్ చేస్తారు. వైద్య రంగంలో వచ్చే అధునాతనమైన టెక్నాలజీని ఎప్పటికప్పుడు అందుబాటులోకి తీసుకువచ్చి పేషంట్లకు అందించడం ఈ క్లినిక్ ప్రత్యేకత. అలాగే అధునాతన వైద్య పరికరాలు, పద్ధతులను వినియోగించడంలో, ఉపయోగించడంలో శిక్షణ పొందడం ద్వారా ఇక్కడి బృందం ఎప్పటికప్పుడు అప్టు డేట్ కావడం ద్వారా పేషంట్లకు అధునాతన వైద్యాన్ని సులభంగా అందించగలుగుతోంది.
అత్యున్నత ప్రమాణాలు..
ఆరోగ్య సంరక్షణ విధానాలు తమ ఆస్పత్రిలో ఉన్న వైద్య సదుపాయాలకు తగినట్టు వైద్యం అందించడం కాకుండా పేషంట్ల అవసరాలను ప్రామాణికంగా తీసుకుని ఇక్కడ చికిత్స అందిస్తారు. పేషంట్ల ఆరోగ్య సంరక్షణలో బృందం సదా భాగస్వామి అయ్యేందుకు సంసిద్ధంగా ఉంటుంది. పేషంట్ల ఆరోగ్యస్థితికి అనుగుణంగా మెరుగైన, సౌకర్య వంతమైన, ఉన్నత ప్రమాణాలతో కూడిన అత్యాధునిక వైద్యం అందించేందుకు ఈ బృందం కట్టుబటి ఉంటుంది. ప్రాథమిక గర్భధారణ పరీక్షలు మొదలుకుని పండంటి బిడ్డకు జన్మనిచ్చే వరకు, అలాగే, నడి వయసులో ఆందోళనకు గురిచేసే మోనోపాజ్ దశలో సాంత్వన కలిగించే విధానంలోనూ, ఇంకా ఆబ్సెస్ట్రిక్స్, గైనకాలజీ సమస్యలకు పరిష్కారం చూపే విషయంలోనూ విస్త•తమైన సేవలను అందిస్తోంది.
డాక్టర్ సుజాత వివేక్ గురించి..
నార్త్ అట్లాంటా ఉమెన్స్ కేర్లో వైద్యం అందించే వైద్య నిపుణుల్లో మొదటి వరుసలో నిలుస్తారు డాక్టర్ సుజాత వివేక్ (ఎండీ, ఎఫ్ఏసీ ఓజీ). ఈమె బోర్డు సర్టిఫైడ్ అబ్సెస్ట్రిక్స్, గైనకాలజీ స్పెషలిస్టు. అమెరికన్ కాంగ్రెస్ ఆఫ్ అబ్స్టెట్రియన్స్ అండ్ గైనకాలజిస్టస్ (ఏసీఓజీ)లో డాక్టర్ సుజాత సభ్యురాలు. అలాగే, అమెరికన్ బోర్డ్ ఆఫ్ అబ్స్టె ట్రిక్స్ అండ్ గైనకాలజీ (ఎబీఓజీ)లో కూడా సభ్యురాలిగా ఉన్నారు. డాక్టర్ సుజాత తన ఓబి జెన్ రెసిడెన్సీని మిచిగాన్లోని వేనే స్టేట్ యూని వర్సిటీలో పూర్తి చేశారు. ఇక్కడ పని చేయడానికి ముందు ఆమె యునైటెడ్ కింగ్డమ్లో ఎన్నో ఏళ్లుగా వైద్య సేవలు అందించారు. ఆబ్స్టెట్రిక్స్ అండ్ గైనకాలజీలో ఆమె ప్రస్తుతం అమెరికా సంయుక్త రాష్ట్రాల్లో అత్యున్నత ప్రమాణాలతో కూడిన వైద్య సేవలందిస్తున్నారు. కాన్పులు కష్టం కావడం, రుతుస్రావ సమయంలో అధిక రక్తస్రావం కావడం, స్త్రీల జననావయవ సమస్యలపై ఆమె ప్రత్యేక శ్రద్ధతో వైద్య సేవలు అందిస్తున్నారు. ఆంగ్లంలోనూ, తమిళంలోనూ అనర్ఘళంగా మాట్లాడే డాక్టర్ సుజాత వివేక్.. పేషంట్లతో అత్యంత స్నేహపూర్వకంగా మెలుగుతారని ఆమె పూర్వ
వ్యక్తిగత అనుభవం.. వృత్తిగత నైపుణ్యం..
ఒక డాక్టర్ కేవలం తనకు గల వృత్తిగత నైపుణ్యంతోనే పేషంట్లను ట్రీట్ చేస్తాడు. వైద్యం చేసే వరకే తన పని అన్నట్టు వ్యవహరిస్తారు. కానీ, ఇక్కడ అలా కాదు. పేషంట్ల ఆరోగ్యమే తమకు సంతోషం అన్నట్టుగా ఇక్కడి వైద్య బృందం పని చేస్తుంది. వృత్తి సంబంధమైన నైపుణ్యంతో పాటు వ్యక్తిగత అనుభవాలను, జ్ఞానాన్ని కూడా కలగలిపి పేషంట్లతో చక్కని అనుబంధాన్ని ఏర్పర్చుకుంటారు. మహిళలు తమ జీవితంలో పలు ముఖ్య దశల్లో వివిధ అనారోగ్య సమస్యలను ఎదుర్కొంటారు. వాటిలో కొందరు కొన్ని సమస్య లను మాత్రమే బయటపెట్టుకోగలుగుతారు. ఇక్కడి వైద్యులు పేషంట్లతో ఆప్యాయంగా మాట్లాడి వారి ఆరోగ్య సమస్యల్ని మొత్తం తెలుసుకుంటారు. వారిని సంపూర్ణ ఆరోగ్యవంతులను చేసేందుకు అహర్నిశలూ కృషి చేస్తారు. మహిళలు తమ ఆరోగ్య సమస్యలపై సలహా సంప్రదింపుల కోసం ఇక్కడికి ఎప్పుడైనా సందర్శించవచ్చు. ఒక్క ఫోన్ కాల్తో అపాయింట్మెంట్ పొందవచ్చు.
చైల్డ్ బర్త్ క్లాసులు
గర్భధారణకు సంబంధించిన అన్ని అంశాలపై మహిళలకు అవగాహన కలిగించేందుకు ప్రసూతి, కాన్పుల విభాగానికి సంబంధించిన నర్సులు, సర్టిఫైడ్ లాక్టేషన్ స్పెషలిస్టుల ఆధ్వర్యంలో చైల్డ్ బర్త్ క్లాసులు నిర్వహిస్తున్నారు. వీటిలో ప్రవేశం, ఇతర వివరాల కోసం నేరుగా సంప్రదించవచ్చు. ఈ తరగతుల్లో సీట్లు పరిమితం.
క్లాసులు నిర్వహించే స్థలం:
నార్త్ అట్లాంటా ఉమెన్స్ కేర్, 6300, హాస్పటల్ పార్క్వే,
సూట్ 375, జాన్స్ క్రీక్, జీఏ 30097, 770- 771- 5270
అందించే సేవలు..
హైరిస్క్ ప్రెగ్నెన్సీ
సిజేరియన్ కాన్పు తరువాత నార్మల్ డెలివరీ
ఫ్యామిలీ ప్లానింగ్
పీసీఓ ప్రాబ్లమ్స్
సంతానలేమి సమస్యలు
అధిక రుతుస్రావం
మోనోపాజ్
ప్రీ కన్సెప్షన్ కౌన్సెలిం
Review అద్భుత వైద్యాన్ని అందించే నార్త్ అట్లాంటా ఉమెన్స్ కేర్..