వయసు పెరుగుతోందంటే అందరికీ ఒకింత ఆందోళనే. వృద్ధాప్యం అందరికీ శత్రువే. అటువంటి వృద్ధాప్యాన్ని దూరం చేయడంలో కాయకల్ప చికిత్స ఎంతో ప్రాముఖ్యతను పొందింది. యోగా పక్రియలో కాయకల్ప అనేది అత్యంత ముఖ్యమైన పక్రియ. మనిషి జీవన శక్తిని మెరుగుపరచడం, మనిషిని శక్తిమంతుడిగా తీర్చిదిద్దడం.. కాయకల్ప విధానం ప్రత్యేకత. ఇది మనిషి జీవిత కాలాన్ని పెంచుతుంది. లైంగికశక్తిని ఆధ్యాత్మిక శక్తిగా మార్చడంలోనూ ఇది కీలకపాత్ర పోషిస్తుంది. శరీర కేంద్ర నాడీ వ్యవస్థను బలోపేతం చేయడానికి, కండరాల్ని ఒక క్రమ పద్ధతిలో దృఢంగా చేయడానికి ఈ యోగా ఉపయోగపడుతుంది.
కాయకల్పలో ‘క్రౌన్ చర్కా’ అనే ఆసనం ఒకటి. దీనిని నుదుటి మధ్య భాగంలో ఉంచుతారు. అది శక్తి ప్రవాహంపై ప్రభావం చూపుతుంది. ఈ సాధనను ఆచరించడం వల్ల మనం ఆరోగ్యకరమైన శరీరంతో పాటు ప్రశాంతమైన మనసు కలిగి నిత్య యవ్వన భావన కలుగుతుంది.
కాయకల్ప యోగా ఆచరణ ఇలా..
కాయకల్ప యోగా ద్వారా శ్వాస సంబంధ సమస్యలు పరిష్కార మవుతాయి. శరీరం మొత్తం శక్తి ప్రవహించి శరీరాన్ని ఎంతో ఉత్తేజితం చేస్తుంది.
కాయకల్ప యోగా ఎక్కువగా స్థిరంగా కూర్చుని చేసే పక్రియ. ఈ పక్రియలో శ్వాసపైనే ఎక్కువగా దృష్టి కేంద్రీకరించడం జరుగుతుంది.
ఈ యోగా పక్రియలో శ్వాస సాధనలోని ఉద్దేశం.. లోపలకు శ్వాసను తీసుకుని లోపలే నొక్కి పెట్టడం, అలాగే శ్వాసవ్యవస్థ శ్వాసను నెమ్మదిగా లోనికి పీల్చుకుని తర్వాత నోటి ద్వారా బయటకు విడుదల చేయడం జరుగుతుంది. అయితే ఈ పక్రియ వల్ల ఊపిరితిత్తులు శుభ్రపడతాయి. విశ్రాంతిని పొందుతాయి.
కాయకల్ప యోగాలో ‘భస్తిక’ అనేది మరో పద్ధతి. ఇందులో ముక్కు ఒక రంధ్రం ద్వారా శ్వాసను పీల్చుకుని, ఆ రంధ్రాన్ని మూసివేసి మరో రంధ్రం నుంచి శ్వాసను గట్టిగా బయటకు విడుదల చేయడం జరుగుతుంది. ఇలా చేయడం వల్ల ఊపిరితిత్తులు శుభ్రపడతాయి.
కాయకల్ప యోగా పక్రియను సాధ్యమైనంత వరకు గురువు ఆధ్వర్యంలో చేయడం ఎంతో ఉత్తమం.
కాయకల్ప యోగా – ప్రయోజనాలు
కాయకల్ప యోగా జీవితకాలాన్ని పెంచి వృద్ధాప్య పక్రియను నెమ్మదిగా జరిగేలా చూస్తుంది. రోగ నిరోధకశక్తిని పెంచుతుంది. ఎలాంటి వ్యాధులు సోకకుండా చేస్తుంది.
జీవనశైలిని మార్చుకోవడానికి సహాయ పడుతుంది. వంశానుపరంగా వచ్చే సమస్యలను తగ్గిస్తుంది.
మహిళల ప్రత్యుత్పత్తి వ్యవస్థను ఎంతో శక్తివంతంగా చేస్తుంది. రుతు చక్ర సంబంధ సమస్యలను తగ్గిస్తుంది. మహిళలకు ఎంతో శక్తిని కలిగిస్తుంది.
దీర్ఘకాలిక వ్యాధులు ఉబ్బసం, మధుమేహం, అర్శమొలలు, చర్మ సంబంధ వ్యాధుల నుంచి వచ్చే సమస్యలను బాగా తగ్గిస్తుంది.
నాడీ వ్యవస్థ యొక్క విధులను మెరుగుపరుస్తుంది. మెదడును చురుకుగా ఉంచుతుంది.
దైనందిన జీవితంలో మనిషి ఎంతో మానసిక శక్తిని కోల్పోతున్నాడు. ఈ యోగా ప్రశాంతతను కలిగిస్తుంది.
Review వృద్ధాప్యానికి..కాయకల్ప చికిత్స.