అమెరికన్ అసోసియేషన్ ఆఫ్ ఫిజీషియన్స్ ఆఫ్ ఇండియన్ ఒరిజన్స్ (ఏఏపీఐ – ‘ఆపి’)… యూఎస్‍లోని భారతీయ మూలాలున్న ఈ ఫిజీషియస్ల అసోసియేషన్ ఒక సరికొత్త సంరంభానికి తెర తీస్తోంది. అవధుల్లేని ఆనందం.. విద్య, వైద్య, వైజ్ఞానిక మహా సంరంభం.. తారల తళుకులు.. వైద్యుల నవావిష్కరణలు.. సంభ్రమాశ్చర్యాలకు గురిచేసే స్టాల్స్.. నోరూరించే రుచులు.. ఉర్రూతలూగించే పాటలు.. ఇంకా ఎన్నో మరెన్నో ఆనందాలకు, వినోదాలకు, విజ్ఞానానికి వేదిక కాబోతోంది.. అట్లాంటాలోని జార్జియా వరల్డ్ కాంగ్రెస్ సెంటర్ (జీడబ్ల్యూసీసీ), సీఎన్‍ఎన్ సెంటర్‍లోని ఓమ్నీ అట్లాంటా వేదికలుగా 2019, జూలై 3 నుంచి 7 వరకు జరిగే ‘ఆపి’ 37వ కన్వెన్షన్‍లో అమెరికాలో భారతీయ మూలాలున్న ఫిజీషియన్లు అందరూ ఒకచోట కలవబోతున్నారు. ఈ 37వ మహా సమ్మేళనంలో వైద్యవిజ్ఞానాన్ని సరికొత్త రీతిలో ఆవిష్కరించడానికి సమాయత్తమవుతున్నారు. వైద్య విజ్ఞానానికి తోడు కాస్తంత వినోదాన్ని జోడించి అందరినీ అలరించే ప్రయత్నం చేస్తోంది ‘ఆపి’.
ఇదీ ‘ఆపి’ నేపథ్యం..
అమెరికన్ అసోసియేషన్ ఆఫ్ ఫిజీషియన్స్ ఆఫ్ ఇండియన్ ఒరిజన్స్ (ఏఏపీఐఐ – ‘ఆపి’).. ఇది భారతీయ మూలాలున్న ఫిజీషియన్ల అమెరికన్ అసోసియేషన్. దాదాపు 20,000 మంది వైద్య విద్యార్థులు, స్థానికులు, విశిష్ట సభ్యులతో సహా 80,000 మంది ఫిజీషియన్ల ఆకాంక్షలకు ఏఏపీఐ ప్రాతినిథ్యం వహిస్తోంది. అమెరికాలోని భారతీయ ఫిజీషియన్లు అందరినీ ఏకత్రాటిపైకి తీసుకురావడంతో పాటు విదేశాల నుంచి ఇక్కడకు వలస వచ్చే వైద్య విద్యార్థులు ఇమ్మిగ్రేషన్, లైసెన్స్ విధానాలకు సంబంధించి ఎదుర్కొంటున్న సవాళ్లను గురించి చర్చించడంతో పాటు వివిధ సమస్యల పరిష్కారానికి ఒక వేదికను ఏర్పాటు చేయాలనే ప్రధాన లక్ష్యంతో అమెరికన్ అసోసియేషన్ ఆఫ్ ఫిజీషియన్స్ ఆఫ్ ఇండియన్ ఒరిజన్స్ (ఏఏపీఐఐ – ‘ఆపి’) ఏర్పాటైంది. భారతీయ – అమెరికన్ డాక్టర్లు అందరూ ఒక బృందంగా ఏర్పడి 1982లో ‘ఆపి’ని స్థాపించారు. అమెరికా సంయుక్త రాష్ట్రాలలో లాభాపేక్ష లేకుండా పని చేసే వైద్య సంబంధ సంస్థల్లో ‘ఆపి’ అతి పెద్దది. అమెరికాలో భారతీయ – అమెరికన్ ఫిజీషియన్లతో కూడిన ఏడు పేషంట్ విభాగాలు, పూర్వ విద్యార్థులు సహా ప్రాంతీయ, రాష్ట్రీయ ప్రత్యేక విభాగాల సంస్థలతో 160 అంశీభూత చాప్టర్లతో కూడిన వ్యవస్థలతో ఏఏపీఐ అమెరికాలోనే అతి పెద్ద ఆధిపత్య సంస్థగా సేవలను అందిస్తోంది.
37వ కన్వెన్షన్‍కు సర్వం సిద్ధం..
2019, జూలై 3వ తేదీ నుంచి నిర్వహించే 37వ వైజ్ఞానిక సదస్సు ప్రధాన అజెండా, విధి విధానాలు నిర్ణయించేందుకు కిక్ ఆస్ మీటింగ్ డిసెంబరు 2, ఆదివారం ‘ఆపి’ నాయకత్వం అట్లాంటాలోని జార్జియా వరల్డ్ కాంగ్రెస్ సెంటర్‍లో జరిగింది. సదస్సును ఘనంగా నిర్వహించే విషయమై ఇందులో చర్చించారు. నరేశ్ పారిఖ్ (ఏఏపీఐ ప్రెసిడెంట్), శ్రీని గంగసాని (వైస్ చైర్మన్, ఏఏపీఐ బీవోటీ, కన్వెన్షన్ చైర్మన్), సుధాకర్ జొన్నలగడ్డ (వైస్ ప్రెసిడెంట్, ఏఏపీఐ), శ్యామల ఎర్రమిల్లి (జీఏపీఐ ప్రెసిడెంట్), ఆశా పరిఖ్ (జీఏపీఐ బీవోటీ చైర్మన్), కన్వెన్షన్ కోచైర్మన్లు రఘు లోలభట్లు, పీయూష్ పటేల్, సుబోథ్ అగర్వాల్ తదితరుల ఆధ్వర్యంలో, ఇతర కన్వెన్షన్ సభ్యుల సహకారంతో ఈ సన్నాహక సమావేశం అట్టహాసంగా జరిగింది. ఫిజీషియన్లు, స్పాన్సర్లు, ఎగ్జిబిటర్లు అంతా సమావేశమై.. 37వ కన్వెన్షన్‍ను ఎలా నిర్వహించాలి? ఏయే కార్యక్రమాలను ప్రదర్శించాలి? అనేది చర్చించడంతో పాటు ఈ ప్రపంచ స్థాయి వేదికపై వైద్య, విజ్ఞానాన్ని, వైద్య రంగంలో ఆధునిక పోకడలను గురించి ప్రపంచానికి చాటడానికి కార్యాచరణను రూపొందించారు. బృందంలోని సభ్యులు.. ఎవరెవరు ఏయే పాత్ర, బాధ్యతలు నిర్వహించాలో చర్చించారు. ఈ కన్వెన్షన్‍కు అతిథులు, వారి సహాయకులు సహా 2,500 మంది వరకు హాజరవుతారని అంచనా.
ఆధునిక వైద్యంపై ఫోకస్
ఈ వైజ్ఞానిక సమావేశంలో భారతీయ సంతతికి చెందిన పలువురు విద్యావేత్తలు, ప్రముఖ ఫిజీషియన్లు, ఆరోగ్య రంగ నిపుణులు, శాస్త్రవేత్తలు ఒక్కచోట చేరనున్నారు. వీరంతా వివిధ వైద్య సంబంధ అంశాలపై మాట్లాడటంతో పాటు సమాచారాన్ని ఇచ్చి పుచ్చుకుంటారు. రాష్ట్రం నలు మూలల నుంచి ఫిజీషియన్లు, ఆరోగ్య రంగ నిపుణులు హాజరై వచ్చే రోజుల్లో వైద్య రంగంలో సంభవించనున్న మార్పులు, ఆధునిక పోకడల గురించిన వైజ్ఞానిక, సైద్ధాంతిక సమాచారాన్ని పంచుకుంటారు. హెల్త్ పాలసీ అజెండాల అభివృద్ధి, వైద్య సంబంధిత చట్టాల ప్రాధాన్యాలపై చర్చిస్తారు. ఇన్ పేషంట్ కేర్, వైద్య పరిజ్ఞాన విశేషాలు, ప్రాక్టీస్ మేనేజ్‍మెంట్‍కు సంబంధించిన వైజ్ఞానిక ఆవిష్కరణలు, ప్రదర్శనలు, ప్రొడక్ట్ థియేటర్ ప్రజెంటేషన్స్ వంటివి ఉంటాయి.
ప్రముఖులు.. తళుకులు..
ఆపి కన్వెన్షన్ అండ్ సైంటిఫిక్ అసెంబ్లీ- 2019.. కేవలం వైద్యపరమైన అంశాలకే పరిమితం కాకుండా.. మరికొన్ని వినోదాత్మక అంశాలను కూడా జోడించి అందరినీ ఆకట్టుకోవడానికి సిద్ధమవుతోంది. ఈ క్రమంలోనే
బాలీవుడ్ ప్రముఖుల వినోద, సాంస్క•తిక ప్రదర్శనలు, ప్రత్యేక స్టాల్స్, విందు వినోదాల వంటివి ఈ కన్వెన్షన్‍లో ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి. నరేశ్ ఫారిఖ్, ఎండీ (ఆపి ప్రెసిడెంట్), శ్రీని గంగసాని, ఎండీ (ఆపి కన్వెన్షన్ చైర్), అజీత్ కొఠారి, ఎండీ (ఆపి బీఓటీ చైర్), సురేశ్‍రెడ్డి, ఎండీ (ఆపి ప్రెసిడెంట్ ఎలెక్ట్).. ఈ కన్వెన్షన్‍కు అందరూ తరలి రావాలని ఆత్మీయ స్వాగతం పలుకుతున్నారు. ఇక, ఈ కన్వెన్షన్‍కు జార్జియా గవర్నర్ బ్రియాన్ కెంప్, ఏఎంఏ ప్రెసిడెంట్ ఎలెక్ట్ పాట్రిస్ హారిస్, ఎండీ, భారత మాజీ క్రికెటర్ కపిల్‍దేవ్ ప్రత్యేక ఆకర్షణ కానుండగా, సద్గురు జగ్గీ వాసుదేవ్, బాలీవుడ్ గాయకుడు శంకర్ మహదేవన్, బాలీవుడ్ తారలు ప్రీతిజింటా, కనికా కపూర్, ఓమి వైద్య వంటి వారు అతిథులుగా హాజరవుతున్నారు. వీరంతా వినోదాన్ని పంచనున్నారు. ఒక చర్చా వేదిక లేదా వర్క్షాపు పద్ధతిలో నడిచే ఈ సదస్సు చికిత్స సంబంధ నిర్వహణలో దీర్ఘకాలిక రోగాలకు దారితీసే పరిస్థితులు, వర్తమాన అంశాలు, సాక్ష్యాధార సహిత సూచనలు, ఆధునిక చికిత్సలు, ప్రస్తుతం చర్చనీయాంశంగా మారిన వైద్య విధానాలపై ప్రధానంగా దృష్టి సారించి విధి విధానాలను రూపొందిస్తుంది. ఈ కన్వెన్షనలోని ఒకటి రెండు సెషన్లలో.. సీఎంఈ ఎథిక్స్కు సంబంధించి పలు రాష్ట్రాలలో తప్పనిసరిగా పునరుద్ధరించవలసిన మెడికల్ లైసెన్సుల గురించి కూడా సభ్యులు విస్త•తంగా చర్చిస్తారు.
సేవకు కేరాఫ్ ‘ఆపి’
ఏఏపీఐ అందరి అవసరాలను దృష్టిలో ఉంచుకుని కొన్ని అద్భుత సేవలను అందిస్తోంది. అవన్నీ ఈ 37వ కన్వెన్షన్ సందర్భంగా అందరికీ పరిచయం కానున్నాయి. వీటి•తో పాటు సీఎంఈ ఆధ్యర్యంలో ప్రపంచ ప్రసిద్ధి చెందిన అధ్యాపకులతో విద్యా సంబంధ విషయాలపై ఈ కన్వెన్షన్‍లో విస్త•తంగా చర్చిస్తారు. దాదాపు 2,500 మంది వైద్యులు, ఆరోగ్య రంగ నిపుణులు సదస్సుకు హాజరు కానున్నారు. ఈ సదస్సుకు హాజరయ్యే ఫిజీషియన్లు అందరూ ప్రత్యేక వైద్యంలో, వాటి ఉప విభాగాల్లో నిపుణులైన వారు. ప్రపంచ ప్రసిద్ధిగాంచిన వైద్య కళాశాలల్లో అధ్యాపకులుగా, విభాగాధి పతులుగా, ఆయా ఆసుపత్రుల ముఖ్య అధికారులుగా బాధ్యతలు నిర్వ హిస్తున్న వారంతా ఏఏపీఐలో ఉన్నారు. దీంతో పాటుగా మెడికల్, ఫార్మా స్యూటికల్ ఉత్పత్తులు, ఉపకరణాలు, వస్తు సామగ్రి, ప్రాక్టీసు సంబంధ సేవలు, ఆర్థికపరమైన సేవలు, ఆఫీసులకు కావాల్సిన వస్తువులు ఇతర విషయాలకు సంబంధించి అనుభవజ్ఞులైన నిపుణులను ఈ సదస్సు సందర్భంగా కలుసుకునే అవకాశం కలగనుంది. వేలాది మంది ఒకేచోట కలుసుకునే అవకాశం ఉండటం వల్ల పరస్పర సమాచార మార్పిడికి అవ కాశం లభిస్తుంది. అందరి ఆశలు, ఆకాంక్షల గురించి చర్చించుకునేందుకు ఇదో అద్భుత వేదిక కానుంది. ఇప్పటికే సదస్సులో పాల్గొనే నిమిత్తం పేర్ల నమోదు ముమ్మరంగా జరుగుతోంది.
‘‘అట్లాంటాలోని అమ్నీ వరల్డ్ కాంగ్రెస్ సెంటర్‍లో జరిగే ఆపి-2019 37వ కన్వెన్షన్ అందరికీ ఆత్మీయ స్వాగతం పలుకుతోంది. వైద్య రంగంలో చోటుచేసుకుంటున్న మార్పుల పరిచయంతో పాటు విందు వినోదాలు అలరిస్తాయి. అందరూ కుటుంబాలతో సహా హాజరు కావాలి. అట్లాంటా, అట్లాంటా బయట, దేశ విదేశాల్లో, భారత్‍లో, యురోపియన్ కంట్రీస్‍లో ఉన్న ఫిజీషియన్లంతా కన్వెన్షన్‍కు తరలిరావాలి. ఫిజీషియన్స్ నెట్‍వర్క్ అంతా ఈ కన్వెన్షన్‍లో పాల్గొని ఆనందించాలని కోరుతున్నాం. ఇక్కడ జరిగే చర్చలు, కలిగే పరిచయాలు కొత్త ప్రపంచాన్ని పరిచయం చేస్తాయి. ‘ఆపి’లో ఎవరైనా సభ్యులు కాకుంటే, వెంటనే 100 డాలర్లు చెల్లించి ఏడాది కాలం సభ్యత్వం పొందవచ్చు. అలాగే, ‘ఆపి’ తరపున గ్రీన్‍కార్డు బ్యాక్‍లాగ్ ఉద్యమం జరుగుతోంది. సెకండ్ జనరేషన్ అంతా ఇందులో భాగస్వాములు కావాలి. ఆపిలో సభ్యత్వాలు పెరిగితే మనమంతా మరింత బలోపేతం అవుతాం. ముప్పై ఏడు సంవత్సరాల క్రితం వివక్షపై నిరంతర పోరాటానికి అమెరికాలో భారతీయ మూలాలున్న ఫిజీషియన్స్ అంతా ఏకమయ్యారు. అదే స్ఫూర్తితో ఆపి నేటికీ ముందుకు సాగుతోంది. గర్వంగా చెప్పుకోవాల్సిన విషయం ఏమిటంటే.. ఈ రోజు అమెరికాలోని ప్రతి ఏడుగురులో ఒకరు భారతీయ మూలాలున్న ఫిజీషియన్లే. వీరే అక్కడి వైద్య, ఆరోగ్య రంగానికి కీలకంగా మారారు. అటువంటి ఆపిలో సభ్యత్వం తీసుకోవడానికి అందరూ ముందుకు రావాల’’ని ఆపీ 37వ కన్వెన్షన్ ఛైర్ డాక్టర్ శ్రీని గంగసాని, ఆపీ వైస్ ప్రెసిడెంట్ డాక్టర్ జొన్నలగడ్డ సుధాకర్ ‘ఆపీ’కి స్వాగతం పలుకుతున్నారు
Review ‘ఆపి’.. రెడీ టు హ్యాపీ.