విదేశాల నుంచి ఇక్కడకు వలస వచ్చే వైద్య విద్యార్థులు ఇమ్మిగ్రేషన్ , లైసెన్సు విధానాలకు సంబంధించి ఎదుర్కొంటున్న సవాళ్లను పరిష్కరించి వారికోసం ఒక వేదికను ఏర్పరచాలనే ప్రధాన లక్ష్యంతో భారతీయ అమెరికన్ డాక్టర్లు అందరూ కలిసి 1982లో ‘ఆపి’( ఏఏపీఐ)ను స్థాపించారు. అమెరికా సంయుక్త రాష్ట్రాల్లో లాభాపేక్ష లేని వైద్య సంబంధ సంస్థల్లో ఇది చాలా పెద్దది. జూలై 4 నుంచి 7 వరకు అట్లాంటాలో జరగనున్న ‘ఆపి’ కన్వెన్షన్ సందర్భంగా సంస్థ అధ్యక్షుడు డా. నరేష్ పరీఖ్‍తో తెలుగు పత్రిక స్పెషల్ ఇంటర్యూ
ప్రస్తుతం అమెరికా మొత్తం మీద సుమారు లక్ష మంది భారతీయ సంతతి ఫిజీషియన్లు పనిచేస్తున్నారు. వీరిలో ఎక్కువశాతం మంది న్యూయార్క్, న్యూజెర్సీ, టెక్సాస్, డల్లాస్, అట్లాంటా, షికాగో, హ్యూస్టన్, లాస్ ఏంజిలిస్‍లలో సేవలందిస్తున్నారు. 70వ దశకం చివర్లో, 80వ దశకం మొదట్లో ఇక్కడకు వచ్చిన మేమంతా దాదాపు 30, 40ఏళ్లుగా వైద్యవ•త్తిలో కొనసాగుతున్నాం. డాక్టర్లుగా ఎంతో అనుభవం గడించాం. ఇప్పుడు మేం రిటైర్మెంట్ దశలో ఉన్నాం. మా పిల్లల్లో కూడా చాలామంది డాక్టర్లే. ఇక్కడ రెసిడెన్సీ లేదా స్కాలర్‍షిప్ పోగ్రాంలో ఉన్న వైద్యవిద్యార్థులు దాదాపు 20,000 మంది దాకా ఉన్నారు. వీరందరితో కలిపి మొత్తం 1,20,000 మంది ఫిజీషియన్లు ప్రస్తుతం ఉన్నారు. అలాగే మేము మరొక ఫిజీషియన్ల గ్రూపుకు కూడా ప్రాతినిధ్యం వహిస్తున్నాం. స్టెప్1,2,3 పరీక్షలు పాసై భారత్ నుంచి ఇక్కడకు వచ్చిన విద్యార్థులలో చాలామంది ఇక్కడ సరైన రెసిడెన్సీఅప్రూవ్డ్ పోగ్రామ్ అందుబాటులో ఉండటం లేదు. ఇటువంటి విద్యార్థులు దాదాపు 10,000మంది ఉన్నారని అంచనా. వీరంతా మెయిన్ స్ట్రీమ్ రెసిడెన్సీ పోగ్రామ్‍లో ప్రవేశం కోసం ప్రయిత్నిస్తున్నవారే. రెసిడెన్సీ పోగ్రామ్ తరువాత వీరంతా ప్రైవేటుగా ప్రాక్టీసు చేస్తారు లేదా స్పెషలైజేషన్ కోర్సుల వైపు వెళతారు. ఇది వీరందరితో కూడిన సంస్థ. అమెరి కన్ మెడికల్ అసోసియేషన్ తర్వాత మాదే అతి పెద్ద సంస్థ. ఆఫ్రికన్ అమెరికన్ అసోసియేషన్, హిస్పానిక్‍అసోసియేషన్‍లు మా తరువాత స్థానంలో ఉన్నాయి.
‘ఆపి’ సభ్యులుగా మేము ఏడాదికొకసారి వాషింగ్టన్‍లో శాసనకర్తలైన అమెరికన్ కాంగ్రెస్ సభ్యులు, సెనేటర్లతో సమావేశమౌతాం. ప్రతి ఏడాది ఒక ప్రత్యేక ఎజెండాతో సమావేశమౌతాం. అవసరమైన అర్హత పరీక్షలన్నీ పాసైనప్పటికీ ప్రాక్టీసు చేయడానికి వీలులేక. వివిధ వ•త్తి, వ్యాపారాలతో జీవనం సాగిస్తున్నారు ఎంతోమంది ఫిజీషియన్లు. అందుకే ఈ సంవత్సరం మా ఎజెండాలో భాగంగా హెచ్1, హెచ్ 4 వీసాల గురించి ప్రధానంగా చర్చించాలనుకుంటున్నాం.
ఉచిత క్లినిక్‍ల ద్వారా సేవ
‘ఆపి’ మరెన్నో రకాల కార్యక్రమాలు చేపడుతోంది.అమెరికాలో. ‘ఆపి’ తరపున మేం యాంటీ ఒబెసీటీ ప్రచార కార్యక్రమాలను నిర్వహిస్తున్నాం. వయోజనుల్లో ఒబేసిటీపై ప్రధానంగా ద•ష్టిసారిస్తున్నాం. ఇవేకాక ఎంతో ప్రమాదకరమైన వ్యాధుల గురించి కూడా విస్త•తంగా అవగాహనా కార్యక్రమాలు చేపడుతున్నాం. ‘ఆపి’ అమెరికాలో పలు ఉచిత క్లినిక్‍లు నిర్వహిస్తోంది. అలాగే భారత్‍లో కూడా ‘ఆపి’ 17 ఉచిత క్లినిక్‍లను నిర్వ హిస్తోంది. ఆపి సభ్యుల్లో చాలామంది భారత్‍లో వైద్యపరమైన సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. వారిలో డాక్టర్ ఠాకూర్ పటేల్ ఒకరు. ఆయన గుజరాత్ లోని మొత్తం 37 జిల్లాల్లో స్వచ్ఛందంగా ఆరోగ్యంపై అవగాహన కార్యక్రమాలను నిర్వహించారు. క్షయ నిర్ధారణ పరీక్షలు, డయాబెటిస్‍ను, బ్లడ్‍సుగర్ అదుపుచేసుకోవడం గురించి అనేక అవగాహన కార్యక్రమాలను నిర్వహించారు. అలాగే ‘ఆపి’ పూర్వ అధ్యక్షుడు డా జగన్ వివిధ పథకాల ద్వారా పలు ఏళ్లుగా భారత్‍లోని గ్రామీణ ప్రాంతాల్లో సేవలందిస్తున్నారు. అ పథకాల ద్వారా ప్రధానంగా పరిశుభ్రమైన తాగునీరు, పారిశుద్ధ్యసమస్య, కాలుష్యనివారణల గురించి క•షిచేస్తున్నారు. 2025కల్లా భారత్‍ను క్షయ నుంచి విముక్తి చేయాలని తీర్మానించాం. మేం దీనికోసం అమెరికా నుంచి విరాళాల్ని సేకరించాం. ఈ సొమ్మును భారత్ లోని రాజ్‍కోట్ ఇంకా పలు ప్రధాన నగరాల్లో చేపట్టబోయే పైలెట్ ప్రాజెక్టు కోసం వినియోగిస్తున్నాం. ఈ ప్రాజెక్టు బాధ్యతలను మా ‘ఆపి’ కార్యాలయ ప్రతినిధులు డాక్టర్ మనోజ్ జైన్, డాక్టర్ అన్వర్ ఫిరోజ్ సిద్దిఖీలు పర్యవేక్షిస్తున్నారు.
‘ఆపి’ సేవా కార్యక్రమాలు
ఇంకా పలు ముఖ్యమైన అంశాలను ‘ఆపి’ పరిగణనలోకి తీసు కుంటుంది. ప్రతి ఏడాది వాటి గురించి ఉన్నత స్థాయిలో చర్చలు జరిపి సంబంధిత కార్యక్రమాలను ఆచరణలో పెడుతోంది. వాటిలో ‘ట్రామాటిక్ బ్రెయిన్ ఇంజ్యూరీ’ ప్రధానమైన అంశం. భారత్‍లో రోడ్బుప్రమాదాలు అధికం. ఈ రోడ్డు ప్రమాదాలు జరిగినపుడు ‘సీపీఆర్’ విధానం గురించి చాలామందికి అవగాహన లేకపోవటం, అంబులెన్సు అందుబాటులో లేకపోవడం వల్ల తీవ్రగాయాల పాలైనవారు ఆసుపత్రికి తీసుకెళ్లేలోపే చనిపోతున్నారు., ఉమెన్స్ఫోరం అధ్యక్షరాలు, ఉమెన్స్ ఎంపవర్‍మెంట్ కమిటీ అధ్యక్షురాలు అయిన నా భార్య డాక్టర్ ఆశాపరీఖ్ ఇటీవల బాలీవుడ్ గాయకుడు, గ్రామీ అవార్డు విజేత సుఖ్వీందర్ సింగ్‍తో కలిసి 9 నగరాల్లో మ్యూజిక్ టూర్లను నిర్వహించారు. లాస్‍ఏంజిలిస్, శాన్‍హోజే, అట్లాంటా, వాషింగ్టన్, కొలంబస్, ఓహియో, షికాగో, డల్లాస్, ఆర్లాండో, న్యూజెర్సీ, న్యూయార్క్, షాలెండ్‍లో. టిక్కెట్ల అమ్మకం ద్వారా వచ్చిన లాభాలను ‘ఆపి’ నిర్వహించే సేవా కార్యక్రమాల కోసం వినియోగిస్తున్నాం.
వెల్‍కమ్ టు ‘ఆపి’2019
ఈ ఏడాది జూలైలో అట్లాంటాలో బ్రహ్మాండంగా నిర్వహించనున్న కన్వెన్షన్‍కు మీ ఆందరికీ ఇదే నా ఆహ్వానం. జూలై 3 నుంచి 7 వరకూ అట్లాంటాలోని ఓమ్నీ హోటల్, జార్జియా వరల్డ్ కాంగ్రెస్‍లు ఈ కన్వెన్షన్‍కు వేదికలు కానున్నాయి. ఈ కన్వెన్షన్‍లో 2000 మందికి పైగా ఫిజీషియన్లు వారి కుటుంబ సభ్యులు పాల్గొంటున్నారు. దేశం నలుమూలలనుంచి ఫిజీషియన్లు, ఆరోగ్య రంగ నిపుణులు, శాస్త్రవేత్తలు ఈ కన్వెన్షన్‍కు హాజరై రాబోయే రోజుల్లో వైద్యరంగంలో సంభవించనున్న మార్పులు, ఆధునిక పోకడల గురించిన వైజ్ఞానిక, సైద్ధాంతిక సమాచారాన్ని పంచుకుంటారు. వైద్యవిద్య గురించి హెల్త్ పాలసీ ఎజెండాల అభివ•ద్ధి, సంబంధిత చట్టాల ప్రాధాన్యతల గురించి చర్చిస్తారు. ఈ సదస్సు 8 గంటల పాటు సీఎమ్‍ఈ క్రెడిట్స్కు కూడా అవకాశం కల్పిస్తోంది. ఇవే కాక ఇన్‍పేషెంట్ కేర్, పలు రకాల వైద్య సంబంధ, వైద్య పరిజ్ఞాన విశేషాలు,ప్రాక్టీస్ మేనేజ్‍మెంట్‍లకు సంబంధించిన వైజ్ఞానిక ఆవిష్కరణలు, ప్రదర్శనలు, ప్రోడక్ట్ థియేటర్ ప్రెజెంటేషన్స్ ఈ కన్వెన్షన్‍కు ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి.ఈ సదస్సుకు హాజరయ్యే ఫిజీషియన్లందరూ భారత్ మరియు అమెరికాలలో ప్రత్యేక వైద్యంలో, వాటి ఉప విభాగాల్లో నిపుణులైన వారు, ప్రపంచ ప్రసిధ్ధిగాంచిన వైద్యకళాశాలల్లో అధ్యాపకులుగా, విభాగాధిపతులుగా, ఆయా ఆసుపత్రుల ముఖ్య అధికారులుగా బాధ్యతలు నిర్వరిస్తున్నవాళ్లు. దీంతో పాటుగా మెడికల్, ఫార్మాస్యూటికల్ ఉత్పత్తులు, ఉపకరణాలు, వస్తుసామగ్రి, ప్రాక్టీసు సంబంధిత సేవలు, ఆర్థికపరమైన సేవలు, ఆఫీసులకు కావలసిన వస్తువులు తదితర విషయాలకు సంబంధించిన అనుభవజ్ఞులైన నిపుణులను కూడా కలుసుకునే అవకాశం కల్పిస్తోంది ఇంకా ఈ కన్వెన్షన్‍లో 150 మంది దాకా అమ్మకం దారులు పాల్గొంటారు. వారి వారి స్టాళ్లలో నగలు, చీరలు, ఆటోమొబైల్స్, మెడికల్ కేర్, ట్రావెల్ ఏజెన్సీలు, ఆర్థికసేవలకు సంబంధించిన ప్రదర్శనలు నిర్వహిస్తారు.
సాంస్క•తిక కార్యక్రమాలు
సాయంత్రం వేళల్లో సాంస్క •తిక కార్యక్రమాలు జరుగుతాయి. ఈ సందర్భంగా బాలీవుడ్ గాయకుడు సుఖ్వీందర్ సింగ్ ‘సంజు’ సినిమాలోని ‘కర్ హర్ మేదాన్ ఫతే’ అనే ఉత్తేజపూరితమైన పాటను పాడతారు. ఎంతో భారీగా, అట్టహాసంగా జరగబోయే ఈ కన్వెన్షన్‍కు హాజరు కండి. మా ఆతిథ్యాన్ని స్వీకరించండి. ‘ఆపి’కి సహకరించండి.
నేను రాజస్థాన్‍లోని జైపూర్‍లో పుట్టాను. ప్రాథమిక విద్యాభ్యాసం గుజరాత్‍లోని రాజ్‍కోట్‍లోని సురేంద్రనగర్‍లో పూర్తిచేశాను. తరువాత మా కుటుంబం నాగపూర్‍కు వలసవెళ్లింది. మా నాన్నగారు ఫార్మసిస్టుగా పనిచేసేవారు. వారాంతాల్లో అక్కడికి వెళ్లి ఫార్మసీ పనుల్లో ఆయనకు సహాయం చేసేవాడిని. డాక్టరు కావాలనేది చిన్నప్పటినుంచీ నా ఆశ. నాగపూర్‍లో మెడిసిన్ పూర్తి చేశాను. తరువాత సర్జికల్ రెసిడెన్సీ పోగ్రామ్ పూర్తి చేసిన అనంతరం బ్రిటన్‍లోని మాంచెస్టర్ రాయల్ ఇన్ఫర్మరీ అఫిలియేటెడ్ హాస్పిటల్లో మూడేళ్లపాటు మెడికల్ ట్రైనింగ్ పూర్తిచేశాను. ఈసిఎఫ్‍ఎమ్‍జీ పరీక్షలు పూర్తి చేసిన తరువాత 1976లో అమెరికాలోని న్యూజెర్సీకి వచ్చాను. అక్కడ ఇంటర్నల్ మెడిసిన్, కార్డియాలజీ, ఇంటర్‍వెన్షన్ కార్డియాలజీలలో శిక్షణ పూర్తిచేసుకుని పెన్సిల్వేనియాలోని స్క్రెంక్టన్‍లో మూడేళ్ల పాటు గ్రూపు ప్రాక్టీసు చేశాను. 1986లో అట్లాంటా వచ్చి ఇక్కడ కార్డియాలజిస్ట్గా ప్రాక్టీసు మొదలుపెట్టాను. గత 32 ఏళ్లుగా ఇక్కడ కార్డియాలజిస్టుగా ప్రాక్టీసు చేస్తున్నాను.
ప్రస్తుతం మేం 30 మంది ఫిజీషియన్లతోకలిసి అట్లాంటాలోని ఈశాన్య ప్రాంతంలో మల్టీస్పెషాలిటీ గ్రూప్‍గా ఏర్పడి గ్రూప్ ప్రాక్టీస్ చేస్తున్నాం. మా గ్రూపు జార్జియా క్లినిక్ ను 1998లో ప్రారంభించింది. ఈ 20 ఏళ్లలో మల్టీస్పెషాలిటీ విభాగంలో, గ్రూప్ ప్రాక్టీస్‍లో మేం ఎంతో మంచి పేరు తెచ్చుకున్నాం. ఈ గ్రూపు ద్వారా మా క్లినిక్‍లో రోజుకు దాదాపు 400 మంది పేషెంట్లకు సేవలందిస్తాం. సిగ్నా, వెల్‍కేర్, హ్య్రుమేనా లాంటి వివిధ రకాల హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీలు మా గ్రూపుకు అత్యుత్తమ క్వాలిటీ రేటింగ్‍ను ఇచ్చాయి. క్వాలిటీ రిపోర్టింగ్, హార్ట్ఎటాక్, స్ట్రోక్స్ల అదుపులో, అవుట్ పేషెంట్ సర్వీసులు, రోగుల కోసం తక్కువ వైద్యఖర్చులు రేడియా లాజికల్‍సర్వీసులు, కార్డియాలజీ సర్వీసులు, పెయిన్ మేనేజ్‍మెంట్, అడ్మిషన్లు, రీఅడ్మిషన్లు తదితర అంశాలలో ఎంతో మంచిపేరు తెచ్చుకున్న మమ్మల్ని 4స్టార్ డాక్టర్స్ ప్రాక్టీస్‍గా పిలుస్తారు.
Review అమెరికాలో ఇండియన్ డాక్టర్స్ అసోసియేషన్ ‘ఆపీ’.