ఆడుతూ పాడుతూ పనిచేస్తుంటే…

ఇంటి పనుల బాధ్యతల్లో కాస్త మార్పులు చేసుకుంటే దాంపత్యం మరింత మధురమవుతుంది. భార్యాభర్తలిద్దరూ కలిసి పని చేసుకుంటుంటే ఇద్దరి మధ్యా ఆనందం, అవగాహన పెరుగుతాయి. ఒక నివేదిక ప్రకారం ఇంటి పనుల్లో సహాయం చేసే పురుషులు ఇతర పురుషులతో పోలిస్తే ఎక్కువ సంతోషంగా ఉంటారు అని తేలింది. ఇంటి పనులు చేయడం తమకు అవమానం అని భావించే పురుషులకు ఈ నివేదిక ఒక సంతోషకరమైన వార్త. ఇలాంటి పురుషులు

మొదట్నుండీ స్త్రీలు ఇంట్లోనే కాదు బయటి పనులు చేస్తున్నారు. వాళ్లు రెండు పాత్రలు చక్కగా పోషించేవారు. ఒకానొక సమయంలో వాళ్లు ఇంట్లోంచి బయటకు వెళ్ళి వ్యవసాయ పనులు చేసేవారు. పశువులను మేపడం, స్నానం చేయించడం, కట్టెలు ఏరడం, తర్వాత ఇంటికి వచ్చి ఇంటి పనుల్లో నిమగ్నమయ్యేవారు. పిల్లలకు పాలు పట్టించడం, వంట చేయడం, భోజనం వడ్డించడం సహా మిగతా పనులన్నీ చేయాల్సి వచ్చేది. ఇంటి బయట ఉన్నంతవరకే పురుషులు కాళ్లూ చేతులు ఆడించేవారు. ఇంటి గుమ్మం లోపలికి రాగానే నీళ్లు తాగి గ్లాసు కూడా తీసేవారు కాదు. ఇంట్లో వారి పని కేవలం విశ్రాంతి తీసుకోవడం, భార్యను పురమాయించడం, నేటికీ చాలా ఇళ్లలో ఇదే సంప్రదాయాన్ని పాటిస్తున్నారు. అయితే మారుతున్న కాలంలో కొత్తతరం భర్తలు, భార్య ఇంట్లోంచి బయటికి వెళ్ళి ఇంటి ఆర్థిక పరిస్థితిలో సహకారం అందించడం చూస్తున్నాం. దాంతో వాళ్ళు ఇంటి పనుల్లో సహాయం చేయడం మొదలు పెట్టారు. ఇదొక మంచి ప్రారంభం.

స్త్రీ కాదు మెషిన్‍

భార్యా, భర్తలు, అత్తా-కోడళ్ల మధ్య ఎక్కువ శాతం గొడవలు ఇంటి పనుల గురించే జరగడం మనం చూస్తుంటాం. కిచెన్‍, ఇతర ఎలక్ట్రానిక్‍ హోం అప్లియన్సెస్‍ కారణంగా స్త్రీలకు పని చేయడం కాస్త సులువుగా మారడం మంచిదైంది. వీటివల్ల వారి పని త్వరగా పూర్తవుతుంది.
అయితే దుస్తులు ఉతికే మెషిన్‍, వాక్యూమ్‍ క్లీనర్‍, మిక్సర్‍, గ్రైండర్‍ మొదలైనవి వాటంతటవే పని చేయవు. వాటిని ఆపరేట్‍ చేయడానికి ఒక మనిషి అవసరముంటుంది. పిల్లల డైపర్స్ మార్చే మెషిన్‍ ఏదైనా ఉందా ? దీంతోపాటే పిల్లల హోం వర్క్ చేయించడం, పొద్దున్నే లేచి పిల్లల్ని నిద్రలేపి వారికి స్నానం చేయించి, యూనిఫాం, సాక్సులు, షూస్‍, టై బెల్ట్ వేయడం, టిఫిన్‍ తినిపించి లంచ్‍బాక్స్ ప్యాక్‍ చేసి వారిని స్కూల్లో దింపే మెషిన్‍ ఉందా? తర్వాత మధ్యాహ్నం పిల్లల్ని తీసుకురావడం, గిన్నెలు కడగడం, ఇల్లు ఊడవడం, లంచ్‍, డిన్నర్‍ ప్రిపేర్‍ చేయడం, తర్వాత అందరికీ వడ్డించే పని చేసే మెషిన్‍ ఏదైనా ఉందా?
స్పష్టంగా చెప్పాలంటే ఆ మెషిన్‍ ఎవరో కాదు స్త్రీ మాత్రమే అవుతుంది. ఒకవేళ ఈ ఇంటి పనుల్లో కొన్ని పనులు భర్త తన భుజాలకెత్తుకుంటే స్త్రీకి కాస్త ఉపశమనం తప్పకుండా లభిస్తుంది.

నిపుణుల అభిప్రాయం ప్రకారం నేటి తీరికలేని జీవితంలో ఇంటి పనులు భార్యాభర్తలు కలిసే చేసుకోవాలి. దీనివల్ల ఒత్తిడి దూరమవుతుంది. భాగస్వామికి సహాయం చేయడం వల్ల మనసు, శరీరంలో శక్తి నిలిచి ఉంటుంది. అవసరమైన సమయంలో తనతో కలిసి పనిచేయడానికి ఒకరున్నారని ఇద్దరికీ అనిపిస్తుంది. దీనివల్ల ఇంట్లో ప్రతిరోజూ జరిగే గొడవలు జరగవు. ఈ పురుషాధిక్య సమాజంలో చాలామంది ఆఫీసుకు వెళ్లే వారిని, వ్యాపారం చేసేవారిని మగవారు అంటారని భావిస్తుంటారు. కిచెన్‍లో యాప్రాన్‍ ధరించి పిండి కలిపే ఏ వ్యక్తినీ మగవాడి జాబితాలో లెక్క పెట్టరు. ఈ కారణంగానే ఇంటి పనుల్లో భార్యకు సహాయం చేసే భర్త, స్నేహితులు, బంధువుల దగ్గర ఈ విషయాన్ని రహస్యంగా ఉంచాలనుకుంటాడు. వాళ్ల ముందు ఇలాంటి పనులు చేయాలనుకోరు.

1960-70 మధ్యకాలంలో హిందీలో వచ్చిన ఒక సినిమాలో భార్యా భర్తలు ఎవరికి వారు తాము చేసే పనే గొప్ప అనుకుంటారు. దీన్ని రుజువు చేసుకోవడానికి ఇద్దరూ తమ పాత్రలు మార్చుకోవాలని నిర్ణయించుకుంటారు. దీని ప్రకారం హీరోయిన్‍ పోషించే పాత్రను హీరో పోషిస్తాడు. హీరో పాత్రను హీరోయిన్‍ పోషిస్తుంది. చివరగా ఈ సినిమా ఒక స్త్రీ ఇంటి పనులు నిర్వహించడంతోపాటు బయటకు వెళ్ళి సంపాదించగలదు అని సందేశం ఇస్తుంది. అయితే ఇంట్లో ఇంటి నిర్వహణ, పిల్లల బాగోగుల బాధ్యత కంటికి కనిపించినంత సులభం కాదని ఇందులో చూపించారు.

హౌస్‍ హజ్బెండ్‍

ఎంతోమంది భర్తలు ఇప్పుడు హౌస్‍ హజ్బెం డ్‍గా ఉన్నారు. బ్యాంకర్‍ నుండి రచయితగా మారిన చేతన్‍ భగత్‍ దీనికి ఉదాహరణగా చెప్పవచ్చు. అతని భార్య కూడా బ్యాంకరే. ఆమె ఆఫీసుకు వెళ్ళిపోతుంది. చేతన్‍ తన రచనా వ్యాసంగాన్ని ఇంట్లోనే చేస్తారు. తన కవల అబ్బాయిలను చూసుకుంటారు. అతను ఇంట్లో కూర్చునే సంపాదిస్తున్నాడనే విషయం నిజమే.

చాలామంది టీవీ కళాకారులు భార్యాభర్తలుగా ఉన్నారు. వీరిలో ఇద్దరూ యాక్టింగ్‍ చేస్తారు. చాలాసార్లు ఒకరు ఏదో సీరియల్‍ లేదా షోలో పనిచేస్తుంటే, ఇంకొకరు ఇంట్లో ఉండే సందర్భాలు ఎన్నో వస్తుంటాయి. అలాంటప్పుడు ఏం జరుగు తుంది ? ఈ విషయమై ఒక నటుడు స్పష్టంగా చెబుతూ ‘నాకు పని లేనప్పుడు, నా భార్యకి తీరిక లేని పని ఉన్నప్పుడు నేను ఇంట్లో పనులు చూసు కుంటాను. తను బయట పనులు చేసుకుంటుంది’ అని చెప్పాడు.
కవులు, రచయితలు, సాహిత్యకారుల్లో ఎంతోమంది హౌస్‍హజ్బెండ్‍లుగా ఉన్నారు, నిజానికి ఈ మార్పు ఒక సాధారణ అంశంగా ఇంకా రూపుదిద్దు కోలేదు. కానీ ఇది ప్రారంభ మైంది. దీంతో భార్యాభర్తలు పరస్పరం పనుల గురించి పట్టించుకోవడం నేర్చుకున్నారు. ఈ మార్పు కేవలం నగరాలు, పట్టణాల్లోనే చూడగలం. మనదేశంలోని మొత్తం జనా భాలో 70 శాతం మంది ప్రజలు గ్రామా ల్లోనే నివసిస్తారు. అక్కడ మగవారు పొగ తాగుతూనో లేదా వ్యవసాయం చేస్తూనో, మరేదో వృత్తిపని చేస్తూనో కనిపిస్తారు. వంటపని మాత్రం ముట్టుకోరు. హౌస్‍ హజ్బెండ్‍ కల్చర్‍ గ్రామాల్లో రావడానికి ఎన్నేళ్లు పడుతుందో చెప్పడం కష్టం.

ఇలా జరిగినప్పుడు..

ఎవరైనా మీ ఇంటి తలుపు కొట్టగానే తలుపు తెరవడానికి వచ్చిన మీ శ్రీవారు రెండు చేతుల్లో ఒక దాంట్లో, గరిటె, రెండో దాంట్లో మసిబట్టతో దర్శనమిచ్చి ‘హల్లో సార్‍ ఎలా ఉన్నారు? లోపలికి రండి’ అన్నప్పుడు మీకెలా అనిపిస్తుంది? మసిబట్టతో ముఖానికి పట్టిన చెమట తుడుచుకుంటున్న దృశ్యం చూస్తే మీరు అయ్యోపాపం అనాల్సిందే ! నిజానికి ఇంట్లో భార్యలు గొడవపడి పుట్టింటికి వె•ళ్ళిపోయినప్పుడు భర్తల పరిస్థితి ఇలాగే ఉంటుంది. పిల్లలను భర్తలకు అప్పగించి వెళ్ళిపోతారు. అప్పుడే పురుషులకు అసలైన పరీక్ష మొదలవుతుంది. పిల్లలు పొద్దున స్కూల్‍కి లేట్‍గా పోకూడదు. అన్న ఆలోచనతో వారికి రాత్రంతా నిద్రపట్టదు. పొద్దున అతను ఓవైపు పిల్లలకు యూనిఫాం వేసి, వారి తల దువ్వుతుంటే మరోవైపు కిచెన్‍లో చపాతీ మాడి మసైపోతుంది! కాబట్టి భార్యలు ఇంటి పనుల్లో భర్త సహాయం తీసుకోవాల్సిందే. కానీ దాన్నే హక్కుగా భావించకూడదు. అలా చేస్తే ఇలాగే అవుతుంది

పెళ్తైన వారికి డిప్రెషన్‍ ఉండదు

ఇంట్లో సహాయం చేయడమంటే మీరు హౌస్‍ హజ్బెండ్‍ అయినట్లు అర్థం కాదు. ఇల్లు, కుటుంబం, పిల్లల సంరక్షణ మొదలైనవి భార్యాభర్తలిద్దరి బాధ్యత. మరి ఇందులో సిగ్గు ఎందుకు?
ఒకవేళ మీరు అలాంటి పనులు చేసే వారైతే పిల్లల న్యాపీ మార్చాననే విషయం ఫ్రెండ్స్కు చెప్పి వారు సిగ్గుపడేలా చేయండి. కూర్చుని తినే అలవాటు ఉందనే భావన వారిలో కలిగించండి. ఇప్పుడు స్త్రీని బానిసగా చూసే కాలం లేదని చెప్పండి.

మీరు ఉమ్మడి కుటుంబంలో ఉంటే మీ అమ్మ, మీ భార్య పిండిన బట్టల బకెట్‍ను తీసుకుని మేడపైకి బట్టలు ఆరవేయడానికి వెళ్ళినప్పుడు మీపై వారు సానుభూతి చూపించగలరు. దీంతోపాటే ఫ్రిజ్‍లో పడిపోయిన పాలు, జామ్‍లను శుభ్రం చేసినప్పుడు సానుభూతి చూపిస్తారు.

నిజానికి ఒక అత్త తన కోడలితో కలిసి కొడుకు పని చేయడాన్ని చూడలేదు. పాత ఆలోచనలతో ఉన్న ఆమె తన కొడుకు ఇమేజ్‍ దెబ్బతింటుందని భావిస్తుంది. ఆమె అలా అనుకున్నప్పుడు మారు తున్న కాలంలో ఇవన్నీ ఎంత అవసరమయ్యాయో మీరు అర్థమయ్యేలా వివరించండి.

పెళ్ళి మనిషిపై అనుకూల ప్రభావం చూపి స్తుంది. ఇటీవల జరిగిన ఒక అధ్యయనం ప్రకారం అవివాహితులతో పోలిస్తే వివాహితులే టెన్షన్‍, డిప్రెషన్‍ లేకుండా ఉంటారని తేలింది. ఈ అధ్యయనంలో 15 దేశాలకు చెందిన 34,493 మందితో మాట్లాడారు. పెళ్ళికి, మానసిక ప్రశాంత తకు సంబంధమేమిటని వారిని అడిగారు.
గతంలో చేసిన అధ్యయనాల్లో పెళ్లితో కేవలం స్త్రీలకే మానసిక ప్రశాంతత లభిస్తుందని భావిం చారు. కానీ ఈ అధ్యయనం పెళ్లిని స్త్రీ, పురుషు లిద్దరికీ లాభదాయకమైనదిగా తేల్చి చెప్పారు. పెళ్ళి తర్వాత సంతోషంగా ఉండటానికి ఇద్దరి మధ్య కమ్యూనికేషన్‍ని అర్థం చేసుకోవడం ఎంతో అవసరం. దీనికోసం పెళ్ళి చేసుకోవడం మాత్రమే సరిపోదు. ‘నువ్వా నేనా’ అనే వాదన వదిలేసి ‘మనం’ అని అను కోవాలి. ప్రతీ సంతోషం, బాధ లోనూ ఇద్దరి పాత్రా ఉంటుందని అనుకోవాలి.

Review ఆడుతూ పాడుతూ పనిచేస్తుంటే….

Your email address will not be published. Required fields are marked *

Related posts

Top